
--------------------------------
బండవెనకే సమాధి చేసారు
ప్రేమని ..
బండ పారిపొయిందే ??
* * * * *
ఏం చూసిందో ఒక్కసారి
అడిగిరా రాదు?
ఏ వేళ తన బలం ఓడిందో
కనుకొన్ని చూసి
బండ వణికి తొణికినప్పుడు
నేల సాక్షం
రాసుకొని రారాదు !
చావు ముళ్ళు విరిచి ప్రభువు
సమాధి తెరచుకుని
బయటికొస్తుంటే
జరిగిన పరిస్థితులు చూసి
బండ కళ్లు చెప్పే
సాక్ష్యం ఒకసారి వినిరా రాదు !!
ఆకాశం తెరుచుకొని దిగి వచ్చిన దూతలు
పరిచర్యేం చేశారో
ఏమి ముచ్చటించారో
మొదటి జాము చావుని చరిచిన
చేతుల శక్తి తనవైపు
ఎలా చూసిందో పలకరించి
పాటగా రాసుకొని రారాదు !!
పునరుత్ధానం జీవం సమాధిలోకి
ప్రవహించినప్పుడు
దిక్కులన్ని పిక్కట్టిల్లి
చరిత్రని చీల్చబోయే యుగపురుషుని
పున:స్వాగతించినప్పుడు
జరిగిన జయ జయధ్వానాల శబ్దపు తీవ్రత
తెలుసుకొని రారాదు !!
మూడు రోజుల కావలిలో
తనలో సమాధిలో జరిగిన సంగతులన్నీ
అడిగి ..
రాజ ముద్ర వణుకుతూ
దైవపు శక్తిని చూసి చస్తూ
సాక్షంగా ఉండమని తనతో చెప్పిన చివరి మాటలేవో
అడిగి రారాదు
రెండవ రాకడ సిద్దపాటుకై నీ మోకాలు గట్టి పడిందో లేదో
ఆ బండకి చూపి రారాదు !!
సామాధి బండగానా
సాక్ష్యపు బండగానా
ఎలా బాగుందో అడిగి నేర్చుకొని
రారాదు ..