Saturday, December 29, 2012

||"అమ్మా " అని ఆయన నన్ను పిలిచాడు || by mercy margaret 
----------------------------------------------------
1.
ఈయనెవరో ఈయన దగ్గరకి లాక్కొచ్చారు అనుకున్నా
పాపం చేసి పట్టు బడ్డాను కదా 
అందరు మగవాళ్ళ లాగే ఈయన మగమనిషైనా 
ఆ ముఖంలో ప్రశాంతత
ఆ ముఖంలో తేజస్సు

2.
నా జుట్టు పట్టుకుని ఆయన దగ్గరకి ఈడ్చుకొస్తుంటే
నేను కాదు
గాయాలు మాట్లాడుతున్నాయి నా ఒంటి మీద
నేను లేను
ఒక పాపాత్మురాలిగ మాత్రమే మిగులున్నా
ఆయన పాదాల దగ్గర

3.
అందరు అతి పరిశుద్దులుగా
ఆయన ప్రవర్తన వెలికితీయ వచ్చారు
ఆయన మాటలను ఇంక్కొన్ని ఒలికించి దైవత్వాన్ని తెలుసుకోవాలని
మగ అనుకునే వారంతా కూడి నన్ను లాకొచ్చి
-"
మోషే ధర్మ శాస్త్రం రాళ్ళతో చంపమంటుంది మరి
ఈమెను ఏం చేయమంటావ్ "-అని అడిగారు

4.
నేను ఆయన వైపు చూసా
ఆయన నా కళ్ళలోకి చూసాడు
నేను ఇవే నా చివరి క్షణాలని లెక్కించు కుంటున్నా
అప్పటికి ఆయన ఏం మాట్లాడలేదు
వంగి నేల మీద వేలుతో ఏవో రాస్తూన్నాడు

5.
పరిశుద్ధులనుకుని రాళ్ళు పట్టుకున్న చేతులవి చదివి
ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి
-"మీలో పాపం చేయని వాడు
మొదట ఆమె మీద రాయి వేయమన్నాడు "
అలాగే నేల మీద రాస్తున్నాడు
కొద్ది సేపటికి అక్కడ ఎవ్వరు లేరు

6.
"అమ్మా " అని ఆయన నన్ను పిలిచాడు
పాపత్మురాలిగా నిలబడ్డ నాకు ఒక నిమిషం ఆ పిలుపుతో
ప్రక్షాళన జరిగింది
గుండెలో ఆయన కరుణ సింహాసనం వేసుకుంది
ఆ దయ గల మాటలు
నాకు నిజమైన ప్రేమ ఇదని చూపించాయి
లోకులకు , దైవానికి మధ్య వ్యత్యాసాన్ని చూపాయి

7.
ఇక
అప్పట్నుంచి ఎవరు నన్ను
పిలిచినా
ఆయన మాటలే చెప్తాను
నా యేసుని మాటలే చెప్తాను

8.
లోకంతో నాకు ఇక పని లేదు
ఈ వేషధారణతో/వేషదారులతో పని లేదు
అతిపరిశుద్దులనబడే వారితో పని లేదు
నేను రక్షించ బడ్డ పాపిని
ఇప్పుడు ఎప్పుడు ఆయన పాదాల దగ్గర
చోటు దక్కించుకున్న పాపిని -
--------- by Mercy Margaret (29/12/2012)---

2 comments:

  1. హ్రుదయమనెడు తలుపునొద్ద యేసు నాధుండు- నిలిచి సదయుడగుచు తట్టుచునుండు -సకల విధములను ||హృదయ ||
    చేర్చుకొనుడి- మీ హృదయమున-శ్రీ యేసు నాధు-నతడు-చేర్చుకొనుచు-మీకిచ్చును -చిరజీవము గృపను ||హృదయ ||
    ------------------------------------------------------------------------------------
    భైరవి రాగం ,అది తాళం, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.రచన శ్రీ.పులిపాక జగన్నాధం

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete